Advertisementt

బాపుబొమ్మకు మరో అవకాశం...!

Sat 13th Jun 2015 08:46 AM
praneetha,brahmothsawam,balakrishna,dictator,anjali  బాపుబొమ్మకు మరో అవకాశం...!
బాపుబొమ్మకు మరో అవకాశం...!
Advertisement
Ads by CJ

‘అత్తారింటికి దారేది’ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించి అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్న పవన్‌ మరదలు... బాపుబొమ్మ ప్రణీతకు ఆ సినిమా తర్వాత అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. తాజాగా ఆమె మహేష్‌ సరసన ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించనుందనే వార్తలు వచ్చాయి. కాగా ఆమెకు ఇప్పుడు మరో స్టార్‌ హీరో చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర వచ్చినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో ఎరోస్‌ ఇంటర్నేషన్‌ సంస్థ నిర్మిస్తున్న ‘డిక్టేటర్‌’ చిత్రంలో ప్రణీతకు సెకండ్‌ హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ప్రణీతకు ఈ రెండు సినిమాలు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తాయో వేచిచూడాల్సివుంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ