Advertisement

‘బాహుబలి’ బడ్జెట్‌ వివరాలు....!

Mon 08th Jun 2015 08:26 AM
bahubali,rajamouli,150 crore,second part,250 crores  ‘బాహుబలి’ బడ్జెట్‌ వివరాలు....!
‘బాహుబలి’ బడ్జెట్‌ వివరాలు....!
Advertisement

‘ బాహుబలి’ సినిమాకు సంబంధించిన బడ్జెట్‌పై ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు. అయితే ఈ విషయంపై రాజమౌళి క్లారిటీ ఇచ్చాడు. రాజమౌళి లెక్కల వివరాలు ప్రకారం ‘బాహుబలి’ తొలిపార్ట్‌కు సంబంధించిన బడ్జెట్‌ 150కోట్లు ఉంటుందని చెప్పారు. ఇక ఈ చిత్రం పార్ట్‌ 2కి సంబంధించిన మిగిలి ఉన్న 30శాతం షూటింగ్‌ పూర్తయ్యే సరికి మొత్తం బడ్జెట్‌ 250కోట్లు దాటుతుందని ఆయన అంటున్నారు. 2016లో ‘బాహుబలి’ పార్ట్‌ 2 విడుదల అవుతుందని సెలవిచ్చిన రాజమౌళి ఈ చిత్రం బడ్జెట్‌పై ఉన్న అనుమాలనాలను నివృత్తి చేశారు. మరి 250కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ‘బాహుబలి’ రెండు భాగాలు దేశ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాలుగా రికార్డు సృష్టిస్తున్నాయి. మరి ఈ మేరకు బడ్జెట్‌ను రికవరీ కావాలంటే అది ఎలా సాధ్యం అనేది రాజమౌళి మార్కెటింగ్‌ స్ట్రాటర్జీ మీద ఆధారపడుతుంది అని చెప్పకతప్పదు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement