అంజలికి గాడ్‌ఫాదర్‌ దొరికాడు....!

Tue 02nd Jun 2015 05:09 AM
anjali,konavenkat,geethanjali,lady oriented movie  అంజలికి గాడ్‌ఫాదర్‌ దొరికాడు....!
అంజలికి గాడ్‌ఫాదర్‌ దొరికాడు....!
Advertisement
Ads by CJ

సినిమా ఫీల్డ్‌లో గాడ్‌ఫాదర్‌ ఉంటే ఇక కెరీర్‌పై పెద్దగా బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకాలం తెలుగులో సరైన గాడ్‌ఫాదర్‌లేని హీరోయిన్‌ అంజలికి ఇప్పుడు కోనవెంకట్‌ అనే స్టార్‌రైటర్‌ పేరుతో ఓ గాడ్‌ఫాదర్‌ వెలిశాడు. తాజాగా బాలకృష్ణ శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందనున్న ‘డిక్టేటర్‌’ సినిమాలో అంజలికి హీరోయిన్‌ చాన్స్‌ రావడం కోన గారి చలవే అంటున్నారు. ఆల్‌రెడీ ఆయన అంజలితో ‘గీతాంజలి’ తీసి హిట్టు కొట్టాడు. అంతేకాదు... అంజలి ఒప్పుకోకపోతే అసలు ‘గీతాంజలి’ చేసేవాడినే కాదని స్టేట్‌మెంట్‌ కూడా ఇచ్చాడు. ఇలా తన సొంత చిత్రాలలో, తాను రచయితగా పనిచేస్తున్న చిత్రాల్లో, మరీ ముఖ్యంగా ఏమైనా మంచి లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో అంజలినే పెట్టుకోమని తను రికమెండ్‌ చేస్తున్నాడట. కాగా ఆయన ‘గీతాంజలి’ చిత్రం సమయంలో అంజలికి ఏకంగా ఓ లగ్జరీ కారును కూడా కొనిచ్చిన సంగతి తెలిసిందే. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ