Advertisementt

‘పండగచేస్కో’ ఫ్యామిలీ చిత్రమా...?

Tue 02nd Jun 2015 03:21 AM
pandaga chesko,ram,gopichand malineni,kona venkat  ‘పండగచేస్కో’ ఫ్యామిలీ చిత్రమా...?
‘పండగచేస్కో’ ఫ్యామిలీ చిత్రమా...?
Advertisement
Ads by CJ

రామ్‌ నటించిన ‘పండగచేస్కో’ చిత్రం ‘ఢీ, రెడీ’ ఫార్మెట్‌లోనే ఉందని రివ్యూలు గగ్గోలు పెడుతున్నాయి. ఆంద్రజ్యోతి పత్రిక అయితే ఈ సినిమాను ఏకిపారేసింది. ఒకే మూసలో సినిమా తీయడాన్ని దర్శకుడు గోపీచంద్‌ మలినేని మాత్రం సమర్థించుకుంటున్నాడు. అదేమని అడిగతే మీడియాపైనే సెటైర్లు వేస్తూ తలతిక్క సమాధానాలు చెబుతున్నాడు. ‘మీ రివ్యూలన్నీ ఒకే ఫార్మెట్‌లోనే ఉంటున్నాయి. మీరేమైనా ఫార్ములా మార్చి కొత్తగా ట్రై చేస్తున్నారా? మేం కూడా అంతే .. అంటూ సమర్థించుకుంటున్నాడు. అంటే ఆయన కాపీ ఫార్ములాని ఫాలో అయ్యాడని ఒప్పుకున్నట్లే కదా...! కాగా ఈ చిత్రాన్ని గోపీచంద్‌ మలినేని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అంటున్నాడు. మరి ఇందులోని కొన్ని డైలాగ్స్‌ వింటుంటే కంపరం పుడుతోంది. ‘నా కూతురిని ఓ రౌండ్‌ వేసుకో.. మా ఆవిడ బ్యాక్‌ చూడు,... మా ఆవిడ బయటుంది... మా ఆవిడ పాతికేళ్లుగా బయటుంది... నా కూతురు క్యారెమ్స్‌ కాయిన్‌ లాంటిది.. ఎవరు వేసినా పడుతుంది.. వంటి డైలాగ్స్‌.. అందునా కూతురు, భార్య గురించి ఇలాంటి చీప్‌ డైలాగ్స్‌ వాడుకొని తమ సినిమాని మాత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా చెప్పుకోవడం చూస్తే ఎవరైనా సిగ్గుతో తలవంచుకుంటారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ