Advertisementt

'బాహుబలి' ట్రైలర్‌ లాంచ్‌కు జక్కన్న కొత్త స్టైల్‌..!!

Mon 01st Jun 2015 04:05 AM
bahubali,trailer launch,theaters,online,rajamouli  'బాహుబలి' ట్రైలర్‌ లాంచ్‌కు జక్కన్న కొత్త స్టైల్‌..!!
'బాహుబలి' ట్రైలర్‌ లాంచ్‌కు జక్కన్న కొత్త స్టైల్‌..!!
Advertisement
Ads by CJ

'బాహుబలి' పబ్లిసిటీకి సంబంధించి జక్కన్న వినూత్న రీతులను అవలంబిస్తున్నాడు. సాధ్యమైనంత ఎక్కువమందిని ఆకర్షించే పబ్లిసిటీని డిజైన్‌ చేస్తున్నాడు. ఇక మే 31న జరగాల్సిన ఆడియో విడుదల వేడుకను వాయిదా వేసిన రాజమౌళి.. జూన్‌ 1న 'బాహుబలి' ట్రైలర్‌ను లాంచ్‌ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

అయితే సాధారణంగా సినిమా ట్రైలర్‌లను మొదట ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు. దీనికి విరుద్ధంగా జక్కన్న మొదట 'బాహుబలి' ట్రైలర్‌ను థియేటర్లలో విడుదల చేయనున్నాడు. ఉదయం 10.30 గంగలకు ఎంపిక చేసిన థియేటర్ల ఈ సినిమా ఈ ట్రైలర్‌ను ప్రేక్షకులు ఉచితంగా చూసే సౌకర్యం కలిగించాడు. ఆ తర్వాత సాయంత్రానికి ట్రైలర్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేనున్నాడు. ఇక సాంపుల్‌గా నిన్న సాయంత్రం విడుదల చేసిన 'బాహుబలి' ట్రైలర్‌కు ప్రేక్షకులనుంచి విశేష స్పందన లభిస్తోంది. హలీవుడ్‌ సినిమా రేంజ్‌లో ఈ ట్రెయిలర్‌ ఉన్నట్లు ప్రేక్షకులు స్పందిస్తున్నారు. ఇక మెయిన్‌ ట్రైలర్‌ కోసం వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రెయిలర్‌ వచ్చిన తర్వాత సినిమాపై ప్రేక్షకుల అంచనాలను ఇంకా ఏ స్థాయికి తీసుకెళ్తుందో..?.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ