Advertisement

'బాహుబలి' లేట్‌కు అసలు కారణం వేరే ఉంది..!!

Sat 30th May 2015 06:16 AM
bahubali,audio release,postponed,reasons  'బాహుబలి' లేట్‌కు అసలు కారణం వేరే ఉంది..!!
'బాహుబలి' లేట్‌కు అసలు కారణం వేరే ఉంది..!!
Advertisement

'బాహుబలి' ఆడియో విడుదల వేడుక వాయిదా పడటంతో తెలుగు అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. రెండున్నరేళ్లుగా ఈ సినిమా పేరు మీద అభిమానులను ఊరిస్తున్న జక్కన్న చెప్పిన తేదీకి కాకుండా సినిమా, ఆడియోల విడుదల తేదీలను వాయిదా వేస్తుండటం సగటు అభిమానికి ఆగ్రహం కూడా తెప్పిస్తోంది. ఇక తాజాగా 'బాహుబలి' ఆడియో వేడుక వాయిదా పడటానికి పోలీసులే కారణమని జక్కన్న చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆడియో వాయిదా పడటానికి మరో కారణం కూడా ఉందని తెలుస్తోంది.

నిజానికి 'బాహుబలి' ఆడియోతోపాటు ట్రైలర్‌ను కూడా ఈనెల 31నే విడుదల చేయాలని జక్కన్న టీం భావిస్తోంది. ఇక ఇటీవలే 'బాహుబలి' ట్రైలర్‌ను పరిశీలించిన సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. దీంతో సినిమా పబ్లిసిటీకి ఇబ్బంది వస్తుందని భావించిన క్లీన్‌ యూ సర్టిఫికేట్‌ కోసం మరో ట్రైలర్‌ను రూపొందించే పనిలో పడ్డారు రాజమౌళి. ఆడియో విడుదల వేడుకకు 8 వేల మందికి మించి అభిమానులనను అనుమతించలేమని పోలీసులు చెప్పడంతో ఇదే అదనుగా రాజమౌళి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఇక ట్రైలర్‌ను రూపొందిన తర్వాత ఒకేసారి ఆడియోను, ట్రైలర్‌ను విడుదల చేయడానికి రాజమౌళి టీం ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement