Advertisementt

అంతా నాగ్‌ ఇష్టమే...!

Sat 30th May 2015 05:41 AM
nagarjuna,akhil,v.v.vinayak,nithin,missile title  అంతా నాగ్‌ ఇష్టమే...!
అంతా నాగ్‌ ఇష్టమే...!
Advertisement
Ads by CJ

అక్కినేని అఖిల్‌ సోలో హీరోగా పరిచయం అవుతూ వినాయక్‌ దర్శకత్వంలో నితిన్‌ నిర్మాతగా చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ‘మిస్సైల్‌’ అనే టైటిల్‌ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఈ టైటిల్‌ను పెట్టడం లేదని, త్వరలో మరో మాసీ టైటిల్‌ను ప్రకటిస్తామని యూనిట్‌ తెలిపింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ‘మిస్సైల్‌’ అనే టైటిల్‌పై వినాయక్‌కు, అఖిల్‌కు, నితిన్‌కు అందరికీ గురి ఉంది. కానీ నాగార్జున మాత్రం ఆ టైటిల్‌కు నో చెప్పాడట. మొదటి సినిమాకే అంత పవర్‌ఫుల్‌ టైటిల్‌ పెడితే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతాయని, దాన్ని అందుకోవడంతో ఏమాత్రం పొరపాటు జరిగినా చిత్రానికే కాదు.. అఖిల్‌ కెరీర్‌కే నష్టం వస్తుందనేది నాగ్‌ వాదన. సో.. నాగ్‌ చెప్పినట్లు మిగిలిన యూనిట్‌ ఒప్పుకోకతప్పలేదు. త్వరలో మరో మంచి టైటిల్‌ను వెతికి ప్రకటించే పనిలో యూనిట్‌ బిజీగా ఉంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ