Advertisementt

‘భారతీయుడు’ సీక్వెల్‌కు రెడీ అంటోన్న నిర్మాత...!

Fri 29th May 2015 05:40 AM
am ratnam,yenthavadugani,bharatheeyudu sequel,shankar  ‘భారతీయుడు’ సీక్వెల్‌కు రెడీ అంటోన్న నిర్మాత...!
‘భారతీయుడు’ సీక్వెల్‌కు రెడీ అంటోన్న నిర్మాత...!
Advertisement
Ads by CJ

ఏ.యం.రత్నం నిర్మాత అని తెలిస్తే ఇక ఆ చిత్రం సూపర్‌హిట్టేనని అందరూ డెసిషన్‌కు వచ్చే విధంగా ఓ వెలుగు వెలిగిన నిర్మాత. భారీ చిత్రాలను తీయడంలో ఆయన శైలి విభిన్నం. కాగా ఇటీవలకాలంలో ఆయన నిర్మాతగా కాస్త వెనుకపడ్డాడు. ‘ఎంతవాడుగానీ’ చిత్రానికి సమర్పకునిగా వ్యవహరించాడు. ఇక ఈయన కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘భారతీయుడు’ ఎంతటిఘనవిజయం సాధించిందోఅందరికీ తెలుసు. కాగా ఈ చిత్రం 1996లో విడుదలైంది. అయినా ఈ సినిమాలో ఆయన చూపించిన అంశాలు ఇప్పటికీ సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. కాగా త్వరలో ఎ.యం.రత్నం ‘భారతీయుడు’కు సీక్వెల్‌ రూపొందించడానికి రెడీ అవుతున్నాడు. అయితే దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కమల్‌హాసన్‌, శంకర్‌లు వారి వారి ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండటంతో వీలుచూసుకొని ఈ చిత్రాన్ని రత్నం మొదలుపెట్టనున్నాడు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ