Advertisementt

నిఖిల్ హీరో అయితే.. హిట్ అయ్యేది!

Tue 26th May 2015 02:29 PM
mosagallaku mosagadu,sudheer babu,nikhil,surya vs surya,aadu magadra bujji  నిఖిల్ హీరో అయితే.. హిట్ అయ్యేది!
నిఖిల్ హీరో అయితే.. హిట్ అయ్యేది!
Advertisement
Ads by CJ

స్వామిరారా సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. సుధీర్‌బాబు, నందిని జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. అయితే ఈ చిత్రానికి టాక్‌పరంగా పాజిటివ్ వున్న ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవని తెలిసింది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ‘స్వామిరారా’ హీరో నిఖిల్ అయితే క్రిష్ పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యేవాడని సుధీర్‌బాబు ఆ పాత్రను సమర్థవంతంగా పోషించలేదని, సుధీర్‌బాబుకు క్రౌడ్‌ఫిల్లింగ్ కెపాసిటీ కూడా లేదని ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ‘ఆడు మగాడ్రారా బుజ్జి’ చిత్రం తర్వాత దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత సుధీర్‌బాబు ‘మోసగాళ్లకు మోసగాడు’తోనే ప్రేక్షకుల ముందుకురావడం కూడా మైనస్‌గా మారిందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా నిర్మాత చక్రి ‘మోసగాళ్లకు మోసగాడు’లో కూడా నిఖిల్‌ను హీరోగా తీసుకుని వుంటే ప్రేక్షకులు అతడ్ని మోసం చేసేవారు కాదేమో! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ