Advertisementt

రెండు రీమేక్‌లపై కన్నేసిన వెంకీ!

Tue 26th May 2015 08:48 AM
venkatesh,piku movie,amithab bhachan,tanu weds manu 2 movie  రెండు రీమేక్‌లపై కన్నేసిన వెంకీ!
రెండు రీమేక్‌లపై కన్నేసిన వెంకీ!
Advertisement
Ads by CJ

ఇటీవల బాలీవుడ్‌లో వచ్చిన ‘పీకూ’ సినిమా మంచిస్టోరీతో అందరినీ ఆకట్టుకోవడమే కాదు... మంచి కలెక్షన్లు కూడా సాధించింది. కాగా ఈ చిత్రానికి ఉన్న కథాబలంతో పాటు చిత్రీకరణకు తక్కువ బడ్జెట్‌తో పూర్తయ్యే అవకాశం ఉండటంతో... ఈ చిత్రాన్ని రీమేక్‌లు బాగా ఇష్టపడే వెంకటేష్‌తో చేయాలని కొందరు నిర్మాతలు భావిస్తున్నారు. చివరకు ఈ రీమేక్‌రైట్స్‌పై సురేష్‌బాబు కన్ను కూడా  పడిందని సమాచారం. మరి ఈ చిత్రంలో వెంకీ  ఏ పాత్రను చేయడానికి ఇష్టపడతాడు? అనే విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బిగ్‌బి అమితాబ్‌బచ్చన్‌ చేసిన పాత్రను చేస్తాడా? లేక అర్ఫాజ్‌ఖాన్‌ చేసిన పాత్రను చేస్తాడా? అనేది వేచిచూడాలి...! అయినా వెంకీ అమితాబ్‌ చేసిన పాత్రను చేసేంత ధైర్యం చేయకపోవచ్చని తెలుస్తోంది. ఇక తాజాగా విడుదలైన ‘తను వెడ్స్‌ మను2’ సీక్వెల్‌ కూడా వెంకీకి బాగా నచ్చిందని సమాచారం. ఈ చిత్రాన్ని చూసిన వెంకీ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడం గమనించాల్సిన విషయం...!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ