Advertisementt

‘జాదూగాడు’కు పోటీ ఉంది!

Tue 26th May 2015 06:11 AM
naga shourya,jadoogadu movie,sapoornesh babu,singam 123,asura movie   ‘జాదూగాడు’కు పోటీ ఉంది!
‘జాదూగాడు’కు పోటీ ఉంది!
Advertisement
Ads by CJ

యంగ్‌ హీరో నాగశౌర్య ఫస్ట్‌టైమ్‌ మాస్‌ క్యారెక్టర్‌ చేసిన చిత్రం ‘జాదూగాడు’ ఈ చిత్రాన్ని జూన్‌ 5న సోలోగా విడుదల చేసి కాస్తైనా లబ్ధి పొందాలని భావించారు. కానీ అనుకోకుండా ఈ చిత్రానికి బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు పోటీగా వస్తున్నాడు. సంపూ హీరోగా మంచు విష్ణు నిర్మాతగా 24 ఫ్రేమ్స్‌  ఫ్యాక్టరీ బేనర్‌లో నిర్మిస్తున్న ‘సింగం 123’ను కూడా జూన్‌ 5న విడుదల చేయాలని విష్ణు భావిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్స్‌కు మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. దీంతో ఈ రెండు చిన్న సినిమాల మద్య పోటీ తప్పేట్లు లేదు. అయితే ‘జాదూగాడు’ కంటే కామెడీ పేరడీ కింగ్‌ సంపూ చిత్రానికే ఎక్కువ పాజిటివ్‌బజ్‌ ఉందనేది వాస్తవం. ఇక ఈనెల 29న విడుదల కావాల్సిస నారారోహిత్‌ ‘అసుర’ కూడా జూన్‌ 5న వస్తోంది. మొత్తానికి ముగ్గురు యువ హీరోలు జూన్‌5న రానున్నారు. మరి వీరిలో ఎవరు విజయాన్ని అందుకుంటారో వేచిచూడాల్సివుంది..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ