Advertisementt

ఒకే రోజు ముగ్గురు ఫ్లాప్‌ హీరోల పోటీ...!

Mon 25th May 2015 04:13 AM
rakshasudu,surya,pandaga chesko,ram,asura,nara rohit  ఒకే రోజు ముగ్గురు ఫ్లాప్‌ హీరోల పోటీ...!
ఒకే రోజు ముగ్గురు ఫ్లాప్‌ హీరోల పోటీ...!
Advertisement
Ads by CJ

మే 29వ తేదీన ‘పండగచేస్కో’ చిత్రంతో సోలోగా రావాలని రామ్‌ ఆశించాడు. కానీ అనుకోని విధంగా ఆయనకు మరో రెండు సినిమాల నుండి తీవ్రపోటీ ఎదురవ్వనుంది. వాస్తవానికి రామ్‌ ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్‌లో ఉన్నాడు. ఈ విధంగా చూస్తే ‘పండగచేస్కో’ చిత్రం ఆయన కెరీర్‌కు చాలా కీలకంగా మారింది. ఇక అదే రోజున నారా రోహిత్‌ ‘అసుర’గా వస్తున్నాడు. వైవిధ్యమైన చిత్రాలు చేస్తున్నప్పటికీ ఒకే ఒక్క సూపర్‌హిట్టు కోసం ఎదురుచూస్తున్న నారా రోహిత్‌కు ఈ చిత్రం చాలా కీలకం అని చెప్పవచ్చు. ఇక ఇటీవల తమిళస్టార్‌ హీరో సూర్య నటించిన చిత్రాలు తమిళంలోనే కాదు.. తెలుగులో కూడా సరిగ్గా ఆడలేదు. ‘సింగం’ సిరీస్‌ తప్ప ఆయనకు ఏ సినిమా కలిసిరాలేదు. దీంతో తమిళంతో పాటు తెలుగులో కూడా తన సత్తా చాటడానికి మే 29న ‘రాక్షసుడు’గా ప్రేక్షకుల ముందు నిలబడనున్నాడు. మరి ఈ త్రిముఖ పోటీలో విజేతలెవ్వరో? పరాజితులు ఎవ్వరో? వేచిచూడాల్సిందే.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ