Advertisementt

భర్త చాటు భార్య....!

Sat 23rd May 2015 07:01 AM
jyothika,hero surya,jyothika reentry,muppai aaru vayasidi movie  భర్త చాటు భార్య....!
భర్త చాటు భార్య....!
Advertisement
Ads by CJ

పెళ్లికి ముందు టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో టాప్‌హీరోయిన్‌ స్థానంలో ఉన్న హీరోయిన్‌ జ్యోతిక. అయితే స్టార్‌ హీరో సూర్యతో వివాహం తర్వాత చాలాకాలంగా ఆమె సినిమాకు దూరంగా ఉంది. అయితే పిల్లలు కాస్త పెద్దవారు కావడంతో జ్యోతిక మరలా మేకప్‌ వేసుకొంది. ఇటీవల ఆమె మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ముప్పై ఆరు వయసిది’తో మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే కమర్షియల్‌గా మాత్రం ఈ సినిమా సక్సెస్‌ కాలేకపోయిందని కోలీవుడ్‌ మీడియా సమాచారం. ఈ చిత్రాన్ని ఆమె భర్త సూర్యనే నిర్మించాడు. అయితే ముఖానికి ఓసారి రంగేసుకున్నాక ఇక దానికి దూరం కావడం కష్టం. అందుకే జ్యోతిక మరో సినిమా చేస్తానంటోంది. సూర్య కూడా జ్యోతిక చేత ఓ సినిమా చేయిస్తానంటున్నాడు. అది కూడా సూర్య సరసనే అంటున్నారు. ఇద్దరికీ సూటయ్యే స్టోరీ కోసం ఎదురుచూస్తున్నామని, ఇప్పటికే నాలుగైదు స్టోరీలు విన్నామని సూర్య మీడియాకు తెలియజేశాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ