Advertisement

ఒక్క హిట్టు ఇవ్వు స్వామీ!

Sat 23rd May 2015 04:12 AM
bollywood,shamitabh movie,arjun kapoor,varun dhawan,bombay velvet movie  ఒక్క హిట్టు ఇవ్వు స్వామీ!
ఒక్క హిట్టు ఇవ్వు స్వామీ!
Advertisement

కొత్త ఏడాది వచ్చి ఆరునెలలు కావస్తోంది. కానీ బాలీవుడ్‌ హిట్లు లేక డీలాపడిపోయింది. 2015లో ఇప్పటివరకు 100కోట్ల సినిమా రాలేదు. భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచిపోయాయి. ‘రాయ్‌, షమితాబ్‌’ చిత్రాలు ఫర్వాలేదనిపించుకున్నాయి. ఇక అక్షయ్‌ ‘బేబీ, గబ్బర్‌’లు 80కోట్ల వరకు వసూలు చేసి ఫర్వాలేదనిపించాయి. గతేడాది విడుదలైన అమీర్‌ఖాన్‌ ‘పీకే’ తర్వాత ఆ స్థాయి విజయం ఇప్పటివరకు ఏ హీరో ఇవ్వలేకపోయాడు. అర్జున్‌కపూర్‌ ‘తేవర్‌’, వరుధ్‌ధావన్‌ ‘బదేలాపూర్‌’ వంటి చిత్రాలు జస్ట్‌ ఓకే అనిపించాయి. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన చిత్రాల్లో సెక్స్‌ అడల్ట్‌ కామెడీ కంటెంట్‌ సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మొత్తానికి హిట్ల కోసం ఎంతకు తెగించేందుకైనా బాలీవుడ్‌ సినీ వర్గాలు సిద్దం అంటున్నా హిట్స్‌ మాత్రం కరువైపోయాయి. 100కోట్లతో తెరకెక్కిన ‘బాంబే వెల్వెట్‌’ కేవలం 25కోట్లు కూడా వసూలు చేసే పరిస్థితి కనిపించడం లేదంటే పరిస్థితి అర్థమవుతోంది...! 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement