Advertisementt

నాగ్‌ కూడా వేలుపెడుతున్నాడట!

Fri 22nd May 2015 01:30 PM
nagarjuna,akhil,chiranjeevi,ram charan,director vinayak   నాగ్‌ కూడా వేలుపెడుతున్నాడట!
నాగ్‌ కూడా వేలుపెడుతున్నాడట!
Advertisement
Ads by CJ

కొడుకుల చిత్రాల్లో తండ్రుల జోక్యం అధికమవుతోంది. అది తమ బాధ్యత అని హీరోల తండ్రులు అంటుంటే ఆయా హీరోల ఇంటర్‌ఫియరెన్స్‌ను తట్టుకోలేకపోతున్నామని నిర్మాతలు, దర్శకులు బోరుమంటున్నారు. రామ్‌చరణ్‌ సినిమాల్లో చిరంజీవి, బన్నీ చిత్రాల విషయంలో అల్లుఅరవింద్‌ గానీ ఇదే పనిచేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి నాగార్జున కూడా చేరిపోయాడు. నాగచైతన్య సినిమాల విషయంలో పెద్దగా పట్టించుకోని నాగార్జున అఖిల్‌ చిత్రం విషయంలో మాత్రం ఇటీవల బాగా వేలుపెడుతున్నాడట. ప్రస్తుతం ఈ చిత్రంలోని యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను స్పెయిన్‌లో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్‌ సీన్స్‌ కావడంతో అక్కడికి దర్శకుడు వినాయక్‌ వెళ్లలేదు. దాంతో ఏకంగా నాగార్జున స్పెయిన్‌లోని సెట్‌లో ప్రత్యక్షమై అఖిల్‌ చేస్తున్న యాక్షన్‌ సీన్స్‌ చూసి అక్కడికక్కడే సలహాలు, సూచనలు ఇస్తున్నాడట. అంతేకాదు.. ఎప్పటికప్పుడు రషెస్‌ కూడా చూస్తున్నట్లు సమాచారం. మొత్తానికి స్పెయిన్‌లో వినాయక్‌లేని లోటును నాగ్‌ తీరుస్తున్నాడని కొందరు సెటైర్లు వేస్తున్నారు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ