Advertisementt

రాజమౌళికి చెక్‌పెట్టిన అమితాబ్‌..!!

Fri 22nd May 2015 10:05 AM
rajamouli,aamithab bacchan,piku,bahubali,record collections  రాజమౌళికి చెక్‌పెట్టిన అమితాబ్‌..!!
రాజమౌళికి చెక్‌పెట్టిన అమితాబ్‌..!!
Advertisement
Ads by CJ

'బాహుబాలి' సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా యావత్‌ భారత్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక బాలీవుడ్‌లో కూడా ఈ సినిమా రైట్స్‌ను ప్రముఖ దర్శకుడు కరణ్‌జోహర్‌ దక్కించుకోవడంతో 'బాహుబలి'పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే తొలి తెలుగు సినిమాగా ఇది రికార్డు సృష్టిస్తుందని అందరూ భావించారు. అంతేకాకుండా భారత్‌లో 2015లో 100 కోట్ల కలెక్షన్లు సాధించిన తొలిచిత్రంగా కూడా ఇది నిలుస్తుందన్న అంచనాలు వెలువడ్డాయి.

2015లో భారత్‌లో విడుదలైన సినిమాల్లో 'బేబి' అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటిరవకు దేశీయంగా ఈచిత్రం రూ. 95.5 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇక విదేశీ కలెక్షన్లను కూడా లెక్కగడితే ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ.110 కోట్లు దాటాయి. మరో రెండు నెలల వరకు పెద్ద సినిమాలేవీ విడుదలకు లేకపోవడంతో 'బాహుబలి' మాత్రమే 'బేబీ' రికార్డులను తిరగరాస్తుందని, దేశీయంగా కూడా తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో కలుపుకొని ఈ ఏడాది రూ. 100 కోట్లు సాధించిన మొదటి సినిమాగా నిలుస్తుందని విశ్లేషకులు భావించారు. అయితే ఇప్పుడు ఈ అంచనాలను 'పీకూ' సినిమా తలకిందులు చేసేలా కనిపిస్తుంది. బడాస్టార్లు లేకుండా అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదొకుణెలు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటివరకు దేశీయంగా రూ. 80 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 107 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇక ఈ వారం కూడా బాలీవుడ్‌లో పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో 'పీకూ' చాలా సులభంగా దేశంలో మరో రూ. 20 కోట్ల కలెక్షన్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే 'బాహుబాలి'కి దక్కాల్సిన రికార్డును 'పీకూ' ఎగురేసుకుపోయినట్లే..!!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ