Advertisementt

నిఖిల్ సినిమా అసలు రేటు ఇది!!

Fri 22nd May 2015 02:32 AM
nikhil,surya vs surya,sivakumar,maa tv,satellite rights  నిఖిల్ సినిమా అసలు రేటు ఇది!!
నిఖిల్ సినిమా అసలు రేటు ఇది!!
Advertisement
Ads by CJ

సినిమా విడుదలకు రెండు వారాల నుంచి సినిమా విడుదలైన రెండు వారాల వరకు నిత్యం ఏదో రకంగా వార్తల్లో కనిపించాలని తహతహలాడే యువ కథానాయకుడిగా నిఖిల్‌కి పబ్లిసిటి పరంగా మంచి ఇమేజే వుంది. ఇటీవల విడుదలైన నిఖిల్ తాజా చిత్రం ‘సూర్య వర్సెస్ సూర్య’ యావరేజీ, ఏబో యావరేజీగా నిలిచిన పబ్లిసిటీతో ఈ చిత్రాన్ని హిట్‌ఖాతాలో చేర్చారు. ఇందులో నిఖిల్ కృషితో పాటు నిర్మాత శివకుమార్ ప్రోత్సాహం కూడా వుంది. 

అయితే ఈ చిత్రాన్ని హిట్ చేసిన నిఖిల్ తన మార్కెట్ రేంజ్‌ను పెంచుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా సూర్య వర్సెస్ సూర్య శాటిలైట్ హక్కులు నాలుగు కోట్లకు ‘మా’టీవీ దక్కించుకుందని సన్నిహితులతో చెబుతున్నాడట. అయితే ఈ హక్కులను మా టీవీ కోటి 75లక్షలకు కొనుగోలు చేసిందని తెలిసింది.కాని నిఖిల్ మాత్రం తన చిత్ర శాటిలైట్ హక్కులు 4 కోట్లకు అమ్ముడవడం ఆనందంగా ఉందంటూ తెగ ప్రచారం చేసుకుంటున్నాడు. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ