మూడో స్థానంలో ‘గంగ’....?

Thu 21st May 2015 06:02 AM
ganga movie,raghava larence,rebel,shankar,robo,i movie  మూడో స్థానంలో ‘గంగ’....?
మూడో స్థానంలో ‘గంగ’....?
Advertisement
Ads by CJ

లారెన్స్‌ జాక్‌పాట్‌ కొట్టేశాడు. ‘రెబెల్‌’ దెబ్బకు కుదేలైన ఆయన ఆ ప్రభావం ‘గంగ’పై పడకుండా  తీసుకున్న జాగ్రత్తలు బాగా వర్కౌట్‌ అయ్యాయి. ఎలాంటి అంచనాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు... హోరెత్తించే పబ్లిసిటీ చేయకుండా చాలా లో ప్రొఫైల్‌ మెయిన్‌టెయిన్‌ చేశాడు. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా గప్‌చుప్‌గా సినిమాను రిలీజ్‌ చేశాడు. ఇది ‘గంగ’కు చాలా ప్లస్‌ అయింది. ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేకుండా ‘గంగ’ను చూశారు. దానికితోడు ‘గంగ’కు  పోటీగా విడుదలైన చిత్రాలన్నీ ఫటేల్‌మనడం ఈ సినిమాకు అనుకోని విధంగా బాగా కలిసొచ్చింది. ‘గంగ’ వన్‌ అండ్‌ ఓన్లీగా బాక్సాఫీస్‌ వద్ద కదం తొక్కింది. ఈ సినిమా తెలుగునాట 17 కోట్ల వరకు రాబట్టింది. గతంలో శంకర్‌ తీసిన ‘రోబో, ఐ’ ల తర్వాత ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘గంగ’ నిలిచిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ