సీనియర్లతో పోటీ పడలేకపోతున్న యంగ్‌ హీరోలు....!

బాలీవుడ్‌లో సీనియర్‌ స్టార్స్‌ అయిన సల్మాన్‌ఖాన్‌, అమీర్‌ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌ల హవా ముందు ఏ యువ హీరో కూడా నిలబడలేకపోతున్నాడు. దీంతో అక్కడ 40 ప్లస్‌ హీరోలదే ఆధిపత్యంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడో కానీ రాదు. పాతనీరు పోవడం కొత్తనీరు చేరడం ఎక్కడైనా సహజమే. కానీ అది బాలీవుడ్‌కు మాత్రం వర్తించడం లేదు. ఇక్కడ వయసు పెరుగుతోన్న స్టార్స్‌ ఇమేజ్‌, క్రేజ్‌లు వారి వయసుతో పాటే పెరుగుతూ పోతుండటం విశేషం. రణభీర్‌, రణవీర్‌, వరుణ్‌ధావన్‌, షాహిద్‌కపూర్‌ లాంటి యంగ్‌ హీరోలు సీనియర్లను చూసి తోకముడుస్తుండటం ఆశ్యర్యమేస్తోంది. ఖాన్‌ త్రయానికి పోటీగా మేమున్నామంటూ ముందుకు వస్తున్న హీరోలెవ్వరూ కనుచూపుమేరలో కనిపించడం లేదు.

senior bollywood star heroes
ranbeer kapoor
ranveer
varun dhavan