పూరీ ఇచ్చింది కేవలం లక్షంట!

Mon 18th May 2015 04:26 AM
puri jagannath,charmi,malladi venkata krishna murthy,jyothilakshmi movie   పూరీ ఇచ్చింది కేవలం లక్షంట!
పూరీ ఇచ్చింది కేవలం లక్షంట!
Advertisement
Ads by CJ

చిరంజీవి 150వ సినిమా కథ వివాదం ప్రస్తుతం రైటర్స్‌ అసోసియేషన్‌లో ఉంది. ఆయన తీసిన మరో చిత్రం కూడా ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో చార్మి నటించిన ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రాన్ని పూరీ ‘మిసెస్‌ పరాంకుశం’ అనే నవల ఆధారంగా తెరకెక్కించాడు. సుప్రసిద్ద నవలా రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి ఈ నవల రాశారు. ఆ స్టోరీలైన్‌ తీసుకొని తనకు నచ్చిన విధంగా.. ఈ ట్రెండ్‌కు తగిన విధంగా మార్పులు చేర్పులు చేసి మరీ పూరీ ఈ చిత్రం చేశాడు. ఈ స్టోరీలైన్‌ తీసుకున్నందుకు పూరీ రచయిత మల్లాదికి కేవలం లక్ష రూపాయలే ఇచ్చాడంటున్నారు. మల్లాది అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కేవలం లక్ష ఇచ్చాడని, ప్రస్తుతం సినిమా రంగంలో ఉన్న లెక్కల ప్రకారం ఇది చాలా చిన్న మొత్తం అని కొందరు విమర్శిస్తున్నారు. ఇంతకు ముందు పూరీ తీసిన ‘టెంపర్‌’ చిత్రం కథ కోసం ఏకంగా కోటి చెల్లించిన పూరీ మల్లాదికి మాత్రం లక్షే ఇవ్వడం దారుణముంటున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ