ఈసారి కొట్టేటట్లే ఉన్నాడు!

CineJosh news

అల్లరినరేష్‌ హీరోగా ఎటీవీ సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ బేనర్‌పై రూపొందుతున్న చిత్రం ‘జేమ్స్‌బాండ్‌’ (నేనుకాదు.. నా పెళ్లాం...) అనేది ఉపశీర్షిక. సాక్షిచౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాయికిషోర్‌ మచ్చ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో సందర్బంగా ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఈ ట్రైలర్‌లో హీరో ఉన్న ఒకే ఒక్క షాట్‌ ఉండటం ఆశ్చర్యకరం. దీన్నిబట్టి ఈ చిత్రం పూర్తిగా హీరోయిన్‌ చుట్టూ తిరిగే కథ అని అర్థమవుతోంది. ఆమె చేత చెప్పించిన డైలాగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఈమధ్యకాలంలో సరైన హిట్‌ లేక మొహం వాచిపోయిన అల్లరినరేష్‌ ఈ చిత్రంతో హిట్‌ కొట్టడం గ్యారంటీ అని ఆశావహుల నమ్మకం. 

allari naresh
sakshi choudary
james bond movie
saikishore machha