సొంత డబ్బా వాయించుకుంటోన్న రానా...!

వీలైనంత ఎక్కువగా మీడియాలో కనిపించాలనే ఆత్రం  ఉన్న నేటితరం టాలీవుడ్‌ హీరోల్లో రానా ఒకడు. తన మొదటి చిత్రం ‘లీడర్‌’ నుంచి ఇదే పద్దతిని ఆయన ఫాలో అవుతున్నాడు. మీడియాతో మరీ ముఖ్యంగా ఇంగ్లీషు మీడియాకు రానా బాగా టచ్‌లో ఉంటాడు. కాగా ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా తన గురించి తానే గొప్పలు చెప్పుకుని సొంత డబ్బా వాయించుకున్నాడు. ‘బాహుబలి’ చిత్రంలో తాను చేసిన భళ్లాలదేవ పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని, భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పాత్ర గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారని, విలనీకి అసలైన అర్థం ఏమిటో తాను చేసి చూపానని.. చెప్పుకుంటూ వచ్చాడు. చదివే వారు ఇదేమిటబ్బా.. ఇంతలా సొంతడబ్బా వాయించుకుంటున్నాడే అని అంటున్నారు.

rana daggubati
leader
bahubali
ballaladeva
english media