Advertisementt

‘లయన్‌’ దెబ్బకు నిర్మాతలకి ఇబ్బందులు!

Fri 08th May 2015 02:39 AM
lion,nbk lion movie,producers,lion release problems  ‘లయన్‌’ దెబ్బకు నిర్మాతలకి ఇబ్బందులు!
‘లయన్‌’ దెబ్బకు నిర్మాతలకి ఇబ్బందులు!
Advertisement
Ads by CJ

మన హీరోలు మాట మీద నిలబడరు. ఒక తేదీన వస్తామని చెప్పి చివరకు మరో తేదీకి వస్తారు. కానీ ఆయా చిత్రాల విడుదలను బట్టి తమ చిత్రాల విడుదల తేదీలను ఖరారు చేసుకునే నిర్మాతలు మాత్రం దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మే 1న వస్తుందని అనుకున్న ‘లయన్‌’ 8వ తేదీకి పోస్ట్‌పోన్‌ అయింది. మరలా వెంటనే ఈ చిత్రాన్ని మే 14కు పోస్ట్‌పోన్‌ చేశారు. ఇక బాలయ్య ముందుగా వస్తే తాము వెనక రావచ్చని భావించిన రామ్‌ వంటి హీరోలు తమ చిత్రం ‘పండగచేస్కో’ని మే 15న విడుదల చేయాలనిభావించారు. కానీ ఇప్పుడు అది వీలైయ్యే పనిగా కనిపించడం లేదు. ఇక ‘లయన్‌’ పోస్ట్‌పోన్‌ వల్ల ఇబ్బందులు పడుతోన్న మరో చిత్రం రవితేజ ‘కిక్‌2’. అ చిత్రానికి కల్యాణ్‌రామ్‌ నిర్మాత కావడంతో తన బాబాయ్‌ చిత్రానికి కనీసం రెండు వారాల గ్యాప్‌ తీసుకోవాలని కళ్యాణ్‌రామ్‌ భావిస్తున్నాడట. మరి ‘లయన్‌’ ప్రభావం ‘కిక్‌2’ని కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది అనేది వాస్తవం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ