Advertisementt

మీడియాను తక్కువ చేసి మాట్లాడిన హీరో..!

Thu 07th May 2015 05:52 AM
siddharth,tollywood,kollywood,web media,comments  మీడియాను తక్కువ చేసి మాట్లాడిన హీరో..!
మీడియాను తక్కువ చేసి మాట్లాడిన హీరో..!
Advertisement
Ads by CJ

తెలుగులో 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' . 'బొమ్మరిల్లు' వంటి హిట్ సినిమాలలో నటించిన హీరో సిద్ధార్థ్. ఆ సినిమాల తరువాత ఆయన నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో తెలుగులో  అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో సిద్ధార్థ్ తన మకాం ను కోలీవుడ్ కు మార్చాడు. అయితే సమంత తో తనకు గల ప్రేమ వ్యవహారం గురించి మీడియా ప్రచురించిన కథనాల గురించి తెలిసిందే. వీటిపై సిద్ధార్థ్ తన కోపాన్ని మరొక విధంగా వ్యక్తపరిచాడు. 

ఇటీవల సిద్ధార్థ్ ఓ ప్రముఖ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో మీడియాను దూషించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ల్యాప్ టాప్ పట్టుకున్న ప్రతివాడు జర్నలిస్ట్ కాడని, వేరొకరి పర్సనల్ జీవితాల గురించి రాసుకుంటూ వెబ్ మీడియా వారు బ్రతుకుతున్నారని అన్నాడు. అంతే కాకుండా జర్నలిస్ట్ అనే వాడికి కొన్ని విలువలుంటాయని అలాంటి విలువలతో కూడిన కామెంట్స్ మాత్రమే చదువుతానని చెప్పాడు. తెలుగులో బొమ్మరిల్లు లాంటి మరో మంచి చిత్రంలో నటించాలనుందని తన మనసులో కోరికను వెల్లడించాడు.  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ