Advertisementt

ద్విపాత్రాభినయాలపై మోజు!

Mon 04th May 2015 04:54 AM
star heroes,double role,samantha,nagarjuna,balakrishna  ద్విపాత్రాభినయాలపై మోజు!
ద్విపాత్రాభినయాలపై మోజు!
Advertisement
Ads by CJ

తెలుగు, తమిళ హీరోలు ప్రస్తుతం ద్విపాత్రాభియాలపై మోజు పెంచుకుంటున్నారు.మొత్తానికి ప్రస్తుతం ద్విపాత్రాభినయాల ట్రెండ్‌ నడుస్తోందని చెప్పవచ్చు. ‘లయన్‌’ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం లేదా రెండు డిఫరెంట్‌ గెటప్పులు చేస్తున్నట్లు సమాచారం. ఇక ‘కిక్‌2’లో రవితేజ తండ్రీకొడుకులుగా డ్యూయల్‌రోల్‌ చేస్తున్నాడట. ‘బాహుబలి’ చిత్రంలో ప్రభాస్‌ శివుడు, బాహుబలి వంటి రెండు పాత్రలను పోషిస్తున్నాడు. ‘సోగ్గాడేచిన్నినాయన’ చిత్రంలో నాగార్జున తాతా మనవళ్లుగా కనిపించి ఎంటర్‌టైన్‌ చేయనున్నాడు. ఇక తమిళంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పులి’లో విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. విక్రమ్‌ హీరోగా రూపొందుతున్న ‘10ఎంద్రకుళ్లా’చిత్రంలో హీరోయిన్‌ సమంత ద్విపాత్రాభినయం చేయనుండటం విశేషం. మొత్తానికి వైవిధ్యమైన గెటప్‌లు లేదా ద్విపాత్రాభినయాలపై స్టార్‌హీరోలు మనసు పారేసుకుంటున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ