Advertisementt

జూలై 10న 'బాహుబలి - ది బిగినింగ్'..!

Sun 03rd May 2015 04:16 AM
bahubali,release date,rajamouli,prabhas,anushka  జూలై 10న 'బాహుబలి - ది బిగినింగ్'..!
జూలై 10న 'బాహుబలి - ది బిగినింగ్'..!
Advertisement
Ads by CJ

బాహుబలి.. భారతీయ వెండితెరపై రాజమౌళి సృష్టించబోతున్న అద్బుత దృశ్యకావ్యం. ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడికి ఈ చిత్రంపై ఎంతో ఆసక్తి. ఎంత త్వరగా చిత్రాన్ని వీక్షిద్దామనే ఆత్రుత. జూలై 10వ తేదీ వరకు మీలో ఆసక్తిని, ఆత్రుతను దాచండి. ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం ఆ రోజునే రాబోతుంది. ప్రముఖ దర్శకులు, బాహుబలి హిందీ వెర్షన్ సమర్పకులు కరణ్ జోహార్ చిత్ర విడుదల తేదీను సోషల్ మీడియాలో వెల్లడించారు. సగర్వంగా రాజమౌళి బాహుబలి చిత్రాన్ని జూలై 10న విడుదల చేస్తున్నామని ట్విట్టర్లో ప్రకటించారు.   

శుక్రవారం నుండి మొదటి భాగం బాహుబలి ది బిగినింగ్ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా అతడు అంతిమ గమ్యం చేరుకోవలసిందే. అంటూ రాజమౌళి నిన్న విడుదల చేసిన పోస్టర్ ప్రేక్షకులలో చిత్రంపై విపరీతమైన ఆసక్తిని కలిగించింది. ఈ పోస్టర్ చిత్రానికి హృదయం లాంటిదని వ్యాఖ్యానించారు. జూలై 4న శివుడు పోస్టర్ విడుదల చేస్తున్నట్టు చెప్పారు.  

ఇప్పటివరకు అపజయం ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రంలో ప్రభాస్,అనుష్క, తమన్నాలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రానా ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. కీరవాణి స్వరకర్త. ఆర్కా మీడియా వర్క్స్ శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ