Advertisementt

బండ్ల గణేష్‌ ట్వీట్‌పై చర్చ!

Sat 02nd May 2015 07:03 AM
bandla ganesh,chiranjeevi,150th movie  బండ్ల గణేష్‌ ట్వీట్‌పై చర్చ!
బండ్ల గణేష్‌ ట్వీట్‌పై చర్చ!
Advertisement
Ads by CJ

మెగాఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే నిర్మాత బండ్ల గణేష్‌ ట్విట్టర్‌లో చేసిన కామెంట్స్‌ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. డైరెక్టర్‌ పూరీజగన్నాథ్‌, రచయిత బి.వి.ఎస్‌. రవి, కళ్యాణ్‌ వర్మల పేర్లు ప్రస్తావిస్తూ... వారితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేసి ‘స్క్రిప్ట్‌ లాక్డ్‌’ అని ట్వీట్‌ చేశాడు. దీంతో ఇది చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ అనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని గణేష్‌ను కొందరు అభిమానులు ప్రశ్నించగా, అసలు విషయం ప్రస్తావించకుండా ‘అన్నయ్య సపోర్టు, దేవుడి ఆశీస్సులతో కష్టపడి పనిచేసి, మీకోసం మరిన్ని మెమరబుల్‌ సూపర్‌హిట్స్‌ను అందిస్తాను... అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా టాలీవుడ్‌ తాజా సమాచారం ప్రకారం చిరంజీవి 150 వ చిత్రానికి పక్కా స్క్రిప్ట్‌ రెడీ అయిందని, రచయిత బి.వి.ఎస్‌.రవి అందించిన స్టోరీని పూరీ జగన్నాథ్‌ మార్పులు చేర్పులు చేస్తున్నారని, చిరంజీవి బర్త్‌డే కానుకగా అదే రోజున షూటింగ్‌ మొదలవుతుందని, ‘ఆటోజానీ’ టైటిల్‌ అందుకోసమే అని, ప్రస్తుతం చిరు మేకోవర్‌ పనుల్లో బిజీగా ఉన్నాడని విశ్వసనీయ సమాచారం. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ