Advertisementt

అల్లరోడి సినిమా ఆ సినిమాకు కాపీయా?

Sat 02nd May 2015 03:54 AM
allari naresh,sakshi choudari,james bond movie  అల్లరోడి సినిమా ఆ సినిమాకు కాపీయా?
అల్లరోడి సినిమా ఆ సినిమాకు కాపీయా?
Advertisement
Ads by CJ

ఒకప్పుడు తెలుగులో హాలీవుడ్‌ చిత్రాలను మాత్రమే ఎత్తేసేవారు. ఇప్పుడు కాలం మారింది. గ్లోబలైజేషన్‌  నేపథ్యంలో ప్రపంచం కుగ్రామంగా మారింది. దాంతో ఎక్కడెక్కడ వనరులు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా సినిమా వారికి ప్రపంచం బాగా దగ్గరైపోయింది. దాంతో ఎత్తిపోతల పథకాలు ఎక్కువయ్యాయి. తాజాగా అలాంటి ప్రయత్నమే అల్లరినరేష్‌ చేస్తున్నట్లు ఫిల్మ్‌సర్కిల్స్‌లో గుప్పుమంటోంది. అల్లరినరేష్‌, సాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ‘జేమ్స్‌బాండ్‌’ ..నేను కాదు.. నా పెళ్లాం... ఉపశీర్షిక. సాయికిషోర్‌ మచ్చ ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. అనిల్‌సుంకర నిర్మాత.  కొరియా చిత్రం ‘మై వైఫ్‌ ఈజ్‌ఎ గ్యాంగ్‌స్టర్‌’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. ఈ సినిమాలో ఓ డాన్‌కు ఓ అమాయకుడికి మధ్య జరిగే కామెడీ రన్‌ అవుతుంది. ‘జేమ్స్‌బాండ్‌’ చిత్రం కూడా దాని స్ఫూర్తిగానే తీస్తున్నట్లు సమాచారం. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ