శింబు, త్రిషలతో జగపతి బాబు..!

Wed 29th Apr 2015 06:58 AM
simbu,trisha,thapsi,jagapathi babu,selva raghavan  శింబు, త్రిషలతో జగపతి బాబు..!
శింబు, త్రిషలతో జగపతి బాబు..!
Advertisement
Ads by CJ
ఒక్క సినిమా పరాజయంతో అంతా తారుమారైంది. 7/జి బృందావన కాలని, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, యుగానికి ఒక్కడు సినిమాలతో తెలుగు, తమిళ భాషల్లో విజయాలు అందుకున్న దర్శకుడు సెల్వ రాఘవన్, వర్ణ పరాజయంతో పలు విమర్శలు, ఇబ్బందులు ఎదుర్కున్నారు. వర్ణ విడుదల తర్వాత ఏడాదికి పైగా విరామం తీసుకుని ఓ కథను రూపొందించారు. శింబు హీరోగా నటించడానికి అంగీకరించారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో కథానాయికలుగా త్రిష, తాప్సీలు ఎంపికయ్యారు. ఇది కొత్త వార్త.  శింబు సరసన త్రిష, తాప్సీ నటించనున్నారు. ఈ నెలలో ఫోటోషూట్ కూడా జరిగింది. మే 6 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తారు. 

ఏం మాయ చేశావే తమిళ వెర్షన్ తో శింబు, త్రిష..  తెలుగులో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులేతో దర్శకుడు సెల్వ రాఘవన్, త్రిష విజయాలు అందుకున్నారు. హిట్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా హిట్ కావాలని ఆశిద్దాం.  
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ