Advertisementt

బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల దిగుమతి!

Sat 25th Apr 2015 05:14 AM
choreographers,bollywood,mahesh babu,karthi,nagarjuna  బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల దిగుమతి!
బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్ల దిగుమతి!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌ స్టార్‌హీరోల చిత్రాలకు ఇప్పుడు బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్లను దిగుమతి చేసుకుంటున్నారు. వాస్తవానికి రెండేళ్ల కిందటే అల్లుఅర్జున్‌ నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రానికి బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ గణేష్‌ఆచార్య పని చేశాడు. కాగా ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీమంతుడు’ చిత్రానికి నేషనల్‌ అవార్డ్‌ను పొందిన కొరియోగ్రాఫర్ల జంట బాస్కో-సీజర్‌లు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. పివిపి సంస్థ నాగార్జున-కార్తి హీరోలుగా తమన్నా హీరోయిన్‌గా వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొంందుతున్న చిత్రంలోని ఓ పాటకు బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌ నృత్యపర్యవేక్షణ చేస్తోంది. మొత్తానికి మన స్టార్‌హీరోల చేత సరికొత్త మూమెంట్స్‌ వేయించడం కోసం బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్లను దిగుమతి చేసుకుంటున్నారు. మరి ఈ ప్రయత్నాలు సినిమాలకు ఏమైనా ప్లస్‌ అవుతాయో లేదో వేచిచూడాల్సివుంది....!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ