Advertisementt

‘గంగ’ భారం దిల్ రాజు దే..!

Wed 22nd Apr 2015 07:57 AM
dil raju,ganga movie,lawrence,bellam konda suresh  ‘గంగ’ భారం దిల్ రాజు దే..!
‘గంగ’ భారం దిల్ రాజు దే..!
Advertisement
Ads by CJ

‘గంగ’ చిత్రం మరలా సంక్షోభంలో చిక్కుకుంది. ఈ సినిమాను ఎలాగైనా బయటకు తేవాలని బెల్లకొండసురేష్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే గతంలో బెల్లంకొండ చేసిన అప్పులు, వాటి తాలూకు వడ్డీలు ‘గంగ’ విడుదలకు మోకాలడ్డుతున్నాయి. ‘రభస’ సమయంలో బాకీపడ్డ సుమారు 18కోట్లు బెల్లంకొండ ఇంకా చెల్లించాల్సివుంది. అవి తీరిస్తేగానీ ‘గంగ’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. మరోవైపు ‘గంగ’ను కొన్న బయ్యర్లు సినిమా ఎప్పుడు రిలీజ్‌ చేస్తావని అడుగుతున్నారు. దీంతో దిల్‌రాజు ఆపద్భాంధవుడి పాత్ర పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘గంగ’ సినిమాను చూసి ముగ్ధుడైన దిల్‌రాజు ఈ సమస్యను నెత్తి మీద వేసుకోవడానికి ముందుకొచ్చాడని తెలుస్తోంది. సో.. దిల్‌రాజును అడ్డుపెట్టి అంటే దిల్‌రాజును హామీగా ఉంచి ఈ సినిమా విడుదల చేయాలనే ఉద్ధేశ్యంలో బెల్లంకొండ ఉంటే మరోవైపు దిల్‌రాజు బెల్లకొండకు ఎలాగూ సినిమాను విడుదల చేసే పరిస్థితి లేదు కనుక ఈ సినిమాను చీప్‌గా కొట్టేయాలని స్కెచ్‌ వేస్తున్నాడట. మొత్తానికి ఎవరి ప్రయత్నాల్లో వారు... ఎవరి స్కెచ్‌లపై వారు లాభనష్టాలు బేరీజు వేసుకుంటున్నారు.  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ