Advertisement

తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నూతన కార్యవర్గం

Mon 20th Apr 2015 02:03 PM
telangana film chamber of commerce,pratani ramakrishna goud  తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నూతన కార్యవర్గం
తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నూతన కార్యవర్గం
Advertisement

తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ నూతన కార్యవర్గం సోమవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ కార్యవర్గ సభ్యులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా..

ప్రతాని రామకృష్ణగౌడ్‌: 400 మందితో తెలంగాణ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఏర్పాటు చేశాం. దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేశాం. చిన్న నిర్మాతలకు సినిమాలు రిలీజ్‌ చేసుకోవడం చాలా కష్టమవుతోంది. దాని గురించి గవర్నమెంట్‌కి, ఛాంబర్‌కి కూడా తెలియజేశాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌.గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఆయనకు సినిమా ఇండస్ట్రీలోని నిర్మాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై పూర్తి అవగాహన వుంది. తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈమధ్య ఆంధ్రజ్యోతి పేపర్‌లో ఇండస్ట్రీకి సంబంధించిన ఎన్నో విషయాల గురించి రాస్తున్నారు. అవి ఇప్పటివరకు ఇండస్ట్రీకి మాత్రమే తెలుసు. పేపర్‌ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. తక్కువ థియేటర్స్‌ వున్నవారితో ఎలాంటి సమస్య లేదు. వంద థియేటర్లు అంతకు మించి వున్నవారితోనే అసలైన సమస్య వస్తోంది. ఆ నలుగురి వల్లే చిన్న నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న ఆర్టిస్టులు తలుచుకుంటే ఏం జరుగుతుందో మా అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్‌గారిని గెలిపించి నిరూపించారు. అలాగే చిన్న నిర్మాతలంతా ఏకమైతే ఏం జరుగుతుందో ఆ నలుగురు ఎటు వెళ్తారో తెలుసుకోవాలి. తెలంగాణ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఏర్పడిన తర్వాత 25 సినిమాలకు శాటిలైట్‌ ఇప్పించడానికి ప్రయత్నం చేశాం. అది త్వరలోనే జరుగుతుంది. అలాగే ఏడెనిమిది చిన్న సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. రాష్ట్రంలో థియేటర్స్‌ పెంచాల్సిన అవసరం వుంది. 300 కెపాసిటీ వున్న థియేటర్స్‌ సిటీలో మిగతా చోట్ల నిర్మిస్తే బాగుంటుందన్నది మా అభిప్రాయం. ముఖ్యమంత్రిగారు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారు. 

నూతన కార్యవర్గ సభ్యులు:

అధ్యక్షుడు: ప్రతాని రామకృష్ణగౌడ్‌, వైస్‌ ప్రెసిడెంట్స్‌: ఆలీ హుసేన్‌, రంగ రవిందర్‌గుప్తు, సెక్రటరీ: హీరో ఆకాష్‌, జాయింట్‌ సెక్రటరీ: వి.వి.రామానుజం,  ట్రెజరర్‌: పవన్‌, ఆర్గరైజర్‌ సెక్రటరీ: బల్లెం వేణుమాధవ్‌, ఇ.సి.మెంబర్స్‌: వై.అలెక్స్‌, ఎస్‌.శివరామ్‌గుప్తా, జి.శంకర్‌గౌడ్‌, కె.రామకృష్ణ, శ్యామల గణేష్‌, శ్రీనివాస్‌, మున్నావర్‌ ఆలీ, ఎస్‌.ఎస్‌.రావు, బి.నర్సింహారెడ్డి.

తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఉపాధ్యక్షులు: కె.శ్రీనివాస్‌రెడ్డి, స్టూడియో సెక్టార్‌ ఛైర్మన్‌: ఇ.వి.ఎన్‌.చారి, సెక్రటరీ: కె.సురేష్‌బాబు, డిస్ట్రిబ్యూటర్‌ సెక్టార్‌ ఛైర్మన్‌: ఉదయ్‌రెడ్డి, సెక్రటరీ: సత్యనారాయణ గౌడ్‌, ఎగ్జిబిటర్‌ సెక్టార్‌ ఛైర్మన్‌: మల్లికార్జున్‌, సెక్రటరీ: సుదర్శన్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement