Advertisementt

ఆరేళ్ల తర్వాత విదేశాలకు వర్మ!

Mon 20th Apr 2015 05:55 AM
ramgopalvarma,sachin joshi,meera chopra,efair movie  ఆరేళ్ల తర్వాత విదేశాలకు వర్మ!
ఆరేళ్ల తర్వాత విదేశాలకు వర్మ!
Advertisement
Ads by CJ
కోట్లలో సినిమాలు తీయడం మానేసి కేవలం లక్షల్లో సినిమాలు తీస్తున్న రామ్‌గోపాల్‌ వర్మ ప్రస్తుతం సచిన్‌జోషి హీరోగా, మీరాచోప్రా హీరోయిన్‌గా సచిన్‌ జోషినే నిర్మాతగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఎఫైర్‌’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ చిత్రానికి మాత్రం వర్మ బాగానే ఖర్చు చేస్తున్నాడట. ఇటీవలి కాలంలో వర్మ విదేశాలలో షూటింగ్‌ జరిపి ఆరేళ్లు అవుతోంది. అప్పుడెప్పుడో నితిన్‌ హీరోగా నటించిన ‘అడవి’ చిత్రం కోసం ఆయన శ్రీలంకలోని శ్రీగిరియా అడవుల్లో షూటింగ్‌ జరిపాడు. ఆ తర్వాత ఆయన ‘ఐస్‌క్రీమ్‌’ వంటి చిత్రాలను ఒకే ఇంట్లో తీశాడు. కాగా తాజా చిత్రం ‘ఎఫైర్‌’ చిత్రం షూటింగ్‌ కోసం ఆయన విదేశాలకు వెళ్లుతున్నాడు. ఈ చిత్రంలోని కీలకసన్నివేశాలను ఆయన పోలెండ్‌లో చిత్రీకరించేందుకు అక్కడ వెళ్లనున్నాడని సమాచారం.
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ