Advertisementt

జేమ్స్ బాండ్ గర్ల్ పాత్రలో త్రిష..?

Sat 18th Apr 2015 01:44 AM
kamal hasan,trisha,manmadha banam,james bond girl  జేమ్స్  బాండ్ గర్ల్ పాత్రలో త్రిష..?
జేమ్స్ బాండ్ గర్ల్ పాత్రలో త్రిష..?
Advertisement
Ads by CJ
నాలుగేళ్ళ తర్వాత కమల్ హాసన్, త్రిష జంటగా నటించడానికి రెడీ అయ్యారని కోలీవుడ్ సమాచారం. డిసెంబర్, 2010లో విడుదలైన 'మన్మధ బాణం' చిత్రంలో కమల్ సరసన త్రిష తొలిసారిగా నటించింది. తాజాగా కమల్ హాసన్ నటించబోయే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో కథానాయికగా కనిపించే అదృష్టం త్రిషను వరించిందట. ఇటీవల దర్శకుడు త్రిషను సంప్రదించి కథ, ఆమె పాత్ర వివరాలు వివరించారు. స్టైలిష్ క్యారెక్టర్ అని సమాచారం. ఈ చెన్నై సుందరి ఇంకా ఓకే చెప్పలేదు. 
కమల్ సహాయకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. జేమ్స్ బాండ్ యాక్షన్ చిత్రాల తరహాలో ఈ చిత్రం ఉంటుందట. త్రిష పాత్ర బాండ్ గర్ల్ తలపిస్తుందట. రెగ్యులర్ షూటింగ్ మే చివరి వారం నుండి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మారిషస్ వెళ్లి కమల్ లొకేషన్స్ ఫైనలైజ్ చేశారు. ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తారు. యువహీరోలు కమల్ హాసన్ జోరు అందుకోవడం కష్టమనిపిస్తుంది అతని స్పీడు చూస్తుంటే. ఒక సినిమాకు విడుదలకు ముందు మరొక సినిమా పనులు మొదలుపెడుతున్నారు. కమల్ నటించిన 'ఉత్తమ విలన్' మే 1న విడుదల కానుంది. తర్వాత 'విశ్వరూపం 2', 'పాపనాశం'(దృశ్యం రీమేక్) వరుసలో ఉన్నాయి.
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ