Advertisementt

తెలంగాణా నిపుణులతో 'హోరాహోరీ'..!

Fri 17th Apr 2015 02:22 AM
teja,horahoree,telangana technicians,summer release  తెలంగాణా నిపుణులతో 'హోరాహోరీ'..!
తెలంగాణా నిపుణులతో 'హోరాహోరీ'..!
Advertisement
Ads by CJ

చిత్రం, నువ్వునేను, జయం వంటి సినిమాలను తీసి టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు తేజ. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు, ట్రెండ్ కు తగ్గట్లుగా తేజ సినిమాలను డైరెక్ట్ చేయలేక పరాజయాలు పొందుతున్నాడు. అయిన పట్టు వదలకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఆయన దర్శకత్వం వహించబోయే తదుపరి చిత్రం 'హోరాహోరీ'లో నలబై మంది కొత్తవాళ్ళను పరిచయం చేస్తుండడం విశేషం.

అది కూడా తెలంగాణా ప్రాంతానికి చెందినవారు కావడంతో ఈ విషయం వార్తల్లోకొచ్చింది. తేజ స్వయంగా తెలంగాణా ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ నుంచి మొత్తం అందరినీ ఎంచుకున్నాడట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన కళాకారులతో నిజమైన తెలంగాణా సినిమాగా 'హోరాహోరీ' ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో వేచి చూడాలి.  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ