బాలీవుడ్ కి సన్నీ సినిమాలు చాలు!

Thu 16th Apr 2015 10:05 AM
sunny leone,ek paheli leela,baby khan,sunny leone movies,adult content  బాలీవుడ్ కి సన్నీ సినిమాలు చాలు!
బాలీవుడ్ కి సన్నీ సినిమాలు చాలు!

బాలీవుడ్‌లో సినిమా కలెక్షన్లు కొల్లగొట్టాలంటే కథ, నటీనటులు, ఉత్తమ విలువలు వంటి కాకరకాయ కబుర్లు అనవసరం అని తేల్చేస్తున్నారు అక్కడి విశ్లేషకులు. కేవలం అడల్ట్‌ కంటెంట్‌ను కావాల్సినంత జోడించి, ఏ సన్నిలియోన్‌ వంటి హీరోయిన్‌ చేత కావాల్సినంత ఎక్స్‌పోజింగ్‌, హాట్‌సీన్స్‌ ఉంటే చాలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం ఖాయమేనంటున్నారు. ఇందుకు ట్రేడ్‌వర్గాలు కూడా ఊ కొడుతున్నాయి. దీనికి ఉదాహరణగా ఇటీవల విడుదలైన సన్నిలియోన్‌ చిత్రం ‘ఏక్‌ పహేలి లీలా’ చిత్రాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. సినిమా మొత్తం సన్నిలియోన్‌ హాట్‌సీన్స్‌తో నింపేసిన ఈ చిత్రం బడ్జెట్‌ 15 కోట్లు కాగా, ఈ చిత్రం మొదటి మూడు రోజుల్లోనే 18కోట్లు వసూలు చేసి అందరికీ లాభాలను తెచ్చిపెట్టింది. మొత్తంగా ఈ చిత్రం 50కోట్లు వసూలు చేయడం ఖాయం అంటున్నారు. బాబీ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇప్పటికే సీక్వెల్‌ నిర్మించే పనిలో నిర్మాతలు బిజీగా ఉన్నారు.