Advertisementt

తనకు ఫ్లాప్ ఇచ్చినోడికే..ఎన్టీఆర్ ఛాన్స్!

Thu 16th Apr 2015 02:14 AM
jr ntr,puri jagannadh,sukumar,hareesh shankar  తనకు ఫ్లాప్ ఇచ్చినోడికే..ఎన్టీఆర్ ఛాన్స్!
తనకు ఫ్లాప్ ఇచ్చినోడికే..ఎన్టీఆర్ ఛాన్స్!
Advertisement
Ads by CJ

ఇంతకు ముందు హిట్‌ డైరెక్టర్లను ఏరికోరి తెచ్చుకొని వారికి వరుస ఆవకాశాలు ఇచ్చి దెబ్బతిన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆ తప్పిదాల నుండి గుణపాఠం నేర్చుకున్నాడు. ఫామ్‌లో లేని సమయంలో పూరీజగన్నాథ్‌కు చాన్స్‌ ఇచ్చి హిట్‌ అందుకొన్న ఎన్టీఆర్‌, ‘1’ (నేనొక్కడినే) చిత్రంతో పెద్ద డిజాస్టర్‌ను అందుకున్న సుకుమార్‌ డైరెక్షన్‌లో  నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆయనకు గతంలో ‘రామయ్యా..వస్తావయ్యా’ వంటి  భారీ డిజాస్టర్‌ ఇచ్చిన హరీష్‌శంకర్‌కు మరో అవకాశం ఇవ్వనున్నాడని సమాచారం. మొత్తంగా ఫ్లాప్‌ల్లో ఉంటే హిట్‌ కొట్టాలనే కసి పెరిగి కసి కసిగా సినిమాలు తీస్తారనే పాయింట్‌ను తీసుకొని ఎన్టీఆర్‌ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఫార్ములా అయినా ఎన్టీఆర్‌కు బ్లాక్‌బస్టర్‌ను అందిస్తుందేమో చూడాలి...!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ