Advertisementt

'మనం' పుకార్లను ఖండించిన నాగార్జున!

Thu 16th Apr 2015 01:25 AM
nagarjuna,manam tv channel,star group,nagarjuna new tv channel  'మనం' పుకార్లను ఖండించిన నాగార్జున!
'మనం' పుకార్లను ఖండించిన నాగార్జున!
Advertisement
Ads by CJ
ప్రముఖ సినీ హీరో, కింగ్ నాగార్జున కొత్త టీవీ ఛానల్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. 'మనం' పేరుతో ప్రారంభించే ఈ ఛానల్లో నిర్మాత పివిపి భాగస్వామి అని ఆ వార్తల సారాంశం. నాగార్జున వీటిని ఖండించారు. అవి కేవలం పుకార్లు మాత్రమేనని తెలిపారు. బుధవారం ఉదయం ట్విట్టర్లో 'మనం' పుకార్లపై ఓ ట్వీట్ చేశారు. 
"నేను 'మనం' అనే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రారంభిస్తున్నట్టు వస్తున్న వార్తలలో నిజం లేదు. ఖచ్చితంగా అందులో నిజం లేదు." అని నాగార్జున ట్వీట్ చేశారు. నాగార్జున, చిరంజీవిలు భాగస్వామ్యులైన ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ గ్రూప్ 'మా'ను ఈ ఏడాది ప్రారంభంలో స్టార్ గ్రూప్ కొనుగోలు చేసింది. సుమారు 2500 కోట్లకు డీల్ జరిగినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. స్టార్ గ్రూప్ చేతుల్లోకి 'మా' వెళ్ళిన తర్వాత కూడా పాత యాజమాన్యానికి, ఉద్యోగులకు తగు గౌరవం ఇచ్చింది. నాగార్జున స్టేట్మెంట్ తో పుకార్లకు చెక్ పెట్టినట్లు అయ్యింది.
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ