Advertisementt

మంచు లక్ష్మి ఆడది కాబట్టే, ఇలా..లేదంటే!

Wed 15th Apr 2015 12:39 AM
manchu lakshmi,dongata trailer,dongata movie dialogue,manchu lakshmi prasanna  మంచు లక్ష్మి ఆడది కాబట్టే, ఇలా..లేదంటే!
మంచు లక్ష్మి ఆడది కాబట్టే, ఇలా..లేదంటే!
Advertisement
Ads by CJ

మంచు లక్ష్మి ప్రసన్న ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'దొంగాట'. అడవి శేష్, బ్రహ్మానందం, మధు ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలో విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాలో మంచు లక్ష్మి హీరోలకు ధీటుగా యాక్షన్ సన్నివేశాలలో ఇరగదీసి నటించిందట. 'అనగనగా ఒక ధీరుడు' తర్వాత మరోసారి అంతటి స్థాయిలో మంచు లక్ష్మికి నటిగా పేరు తీసుకొచ్చే సినిమా అవుతుందని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మిని కీర్తిస్తూ ట్రైలర్లో డైలాగులు కూడా రాశారు. 

"ఎం పెర్ఫార్మన్స్ రా..! ఆడది కాబట్టే హీరోయిన్ అయ్యింది, లేదంటే మోహన్ బాబే" అంటూ ఇతర ఆర్టిస్టుల చేత డైలాగులు చెప్పించారు. మంచు లక్ష్మి మంచి నటి, కాకపోతే మాటలో అమెరికా యాస ప్రేక్షకులను ఇబ్బంది పెడుతుంది, అంతే. ఇటివల కాలంలో సరైన విజయాలు సొంతం చేసుకొని మంచు వారి ఆడపడుచు నటిగా, నిర్మాతగా 'దొంగాట'తో విజయం సొంతం చేసుకుంటుందో..? లేదో..? ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. కామెడీ కింగ్ బ్రాహ్మి ముఖ్య పాత్రలో హాల్ చల్ చేశాడు. రానా అతిధి పాత్రతో పాటు ఇతర స్టార్ హీరోలు ఓ పాటలో తళుక్కున మెరవడం సినిమాకు అదనపు ఆకర్షణ. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ