మహేష్‌తో బెంగాళీ భామ!

Tue 14th Apr 2015 10:08 AM
mahesh babu,srimanthudu movie,sruthi haasan,angana rai  మహేష్‌తో బెంగాళీ భామ!
మహేష్‌తో బెంగాళీ భామ!
Sponsored links

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో నటించే అవకాశం కోసం ఫామ్‌లో ఉన్న హీరోయిన్లే ఎదురుచూస్తుంటారు. ఎంతటి హీరోయిన్‌ అయినా ఆయన సరసన ఓ సారి నటించాలని కలలు కంటుంది. అలాంటిది ఓ బెంగాళీ భామ మహేష్‌ సరసన నటించాలని ఆశపడటంతో గొప్పేముంది. కాగా కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా శృతిహాసన్‌ మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ‘శ్రీమంతుడు’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం అంగనారాయ్‌ని ఎంపిక చేశారు. హీరోయిన్‌గా కాకుండా ఓ కీలకపాత్ర కోసం ఆమెను తీసుకున్నారని సమాచారం. ఇప్పటికే ఈ అమ్మడు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. ఈ పాత్ర కీలకమైనది కావడంతో దర్శకుడు ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట. మొత్తం 70మంది అమ్మాయిలను ఆడిషన్‌ చేసి మరీ ఎంపిక చేశాడట. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు మహేష్‌కు తండ్రిగా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. క్లాస్‌గా... డిజైనర్‌సూట్‌లో జగపతి కనిపించనున్నాడు. ఈ చిత్రంలో తండ్రి కొడుకుల అనుబందం కూడా కీలకంగా ఉంటుంని తెలుస్తోంది.

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019