Advertisementt

బుధవారం నాడు 'మా' ఎన్నికల తీర్పు..!

Tue 14th Apr 2015 02:29 AM
rajendharprasad,jayasudha,maa association,elections  బుధవారం నాడు 'మా' ఎన్నికల తీర్పు..!
బుధవారం నాడు 'మా' ఎన్నికల తీర్పు..!
Advertisement
Ads by CJ

'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న రాజేంద్రప్రసాద్, జయసుధ ఒకరి బృందం పై మరొకరు ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసుకున్నారో తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారో అని అందరిలో ఉత్కంట నెలకొంది. అయితే 'మా' ఎన్నికలలో అక్రమాలు జరుగుతున్నాయని ఒ.కళ్యాన్ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వాదనలు కోర్టులో జరుగుతూనే ఉన్నాయి. 

ఎన్నికలు సజావుగా జరపమని, తీర్పు కోర్టు వాదన ముగిసిన తరువాతే వెలువరించమని కోర్టు తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వాదనలు సోమవారం ముగిసాయి. ఈ విషయమై తీర్పు బుధవారం తెలుపనున్నారు. 'మా' ఎన్నికలు ముగిసి రెండు వారాలు దాటినా కోర్టు తీర్పు కోసం ఎవరు గెలిచారనే విషయం వెల్లడించలేదు. అయితే 'మా' అధ్యక్ష పదవి ఎవరిని వరించనుందో బుధవారం తెలియనుంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ