Advertisement

ఫాల్కే అవార్డు అందుకోలేనన్న శశికపూర్‌..!!

Sun 12th Apr 2015 05:37 AM
shashi kapoor,dadasaheb phalke award,wheel chair  ఫాల్కే అవార్డు అందుకోలేనన్న శశికపూర్‌..!!
ఫాల్కే అవార్డు అందుకోలేనన్న శశికపూర్‌..!!
Advertisement

భారత దేశంలో సినిమాలకు సంబంధించి అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు. అయితే ఈ అవార్డు అందుకోవాడానికి తాను రాలేనంటూ శశికపూర్‌ ప్రభుత్వానికి లేఖ రాశాడు. 2013 సంవత్సరానికిగాను శశికపూర్‌ను దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డుకు ప్రభుత్వం ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన అనారోగ్యంరీత్యా కేవలం వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు. దీంతో ఈ అవార్డు అందుకోవడానికి తాను రాలేనని, తన పరిస్థితిని గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరారు. దీంతో ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఓ నటుడి ఇంటికి వెళ్లి దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు అందించిన సంఘటన గతంలో ఒక్కసారి జరిగింది.  2012 సంవత్సరానికిగాను దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డుకు బాలీవుడ్‌ విలన ప్రాణ్‌ ఎంపికయ్యాడు. ఆయనకు తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉండటంతో ఆయన స్వగృహంలోనే ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement