Advertisementt

దర్శకులు, హీరోలపై బ్రహ్మానందం సెటైర్లు..!

Sat 11th Apr 2015 05:30 AM
brahmanandam,dohchay movie,ms naarayana,bullet babu role  దర్శకులు, హీరోలపై బ్రహ్మానందం సెటైర్లు..!
దర్శకులు, హీరోలపై బ్రహ్మానందం సెటైర్లు..!
Advertisement
Ads by CJ
తెలుగు సినిమాల్లో స్పూఫ్ క్యారెక్టర్లు అంటే ఎమ్మెస్ నారాయణ గుర్తోచ్చేవారు. 'అందరివాడు', 'డిస్కో', 'దూకుడు' తదితర సినిమాల్లో హీరో మేనరిజమ్స్ కాపీ కొడుతూ.. కామెడీ చేశాడు. సరిగ్గా అలాంటి పాత్రను నాగ చైతన్య 'దోచేయ్'లో బ్రహ్మానందం చేస్తున్నాడు. బ్రాహ్మి ఈ సినిమాలో తెలుగు సినిమా హీరో 'బుల్లెట్ బాబు'గా నటించాడు. స్టార్ దర్శకులు, హీరోలపై బ్రాహ్మి చేత బాగానే సెటైర్లు వేయించాడట దర్శకుడు. 

"కథేంటో చెప్పు, ఇతర హీరోల పేర్లు చెప్పి బుట్టలో వేయకు."  "వీళ్ళు స్టొరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, సినిమా తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు." ఈ డైలాగులు వింటే అర్ధం కావడం లేదూ, దర్శకులపై ఎ రేంజ్లో సెటైర్లు పడ్డాయో..! బ్రాహ్మి 'బుల్లెట్ బాబు' పాత్ర ద్వారా హీరోలపై కూడా బాగానే సెటైర్లు వేశారట. పబ్లిక్ ఫంక్షన్స్, ఆడియో రిలీజ్ సమయాల్లో హీరోలు ఎలా బిహేవ్ చేస్తారు..? అనే అంశాన్ని కామెడీగా చూపించారు. రెగ్యులర్ సినిమాల్లో చేసినట్టు కాకుండా 'దోచేయ్'లో మంచి పాత్ర చేశాను. కామెడీలో కొత్తదనం ఉంటుందని బ్రహ్మానందం చెప్తున్నారు. సినిమా విజయం సాదిస్తుందంటూ నమ్మకం వ్యక్తం చేశారు.    

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ