పవన్‌ అభిమానులకు తీపి వార్త!

Sat 11th Apr 2015 01:22 AM
pawan kalyan,gabbar singh 2,boby  పవన్‌ అభిమానులకు తీపి వార్త!
పవన్‌ అభిమానులకు తీపి వార్త!
Advertisement
Ads by CJ

ఎప్పటినుండో సినీ ప్రియులను అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చిన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ చిత్రం ‘గబ్బర్‌సింగ్‌2’ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌కు ముహూర్తం ఖరారైందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ఈ చిత్రాన్ని పవన్‌కళ్యాన్‌ మిత్రుడు శరత్‌మరార్‌ తన నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎరోస్‌ ఇంటర్నేషనల్స్‌ సంస్థ భాగస్వామ్యంతో తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రాన్ని మే4వ తేదీ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభిస్తారని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో అనీషాఆంబ్రోస్‌తో పాటు మరో హీరోయిన్‌ నటించనుంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని ఒక్కసారి పట్టాలెక్కిస్తే ఎక్కడా గ్యాప్‌ రాకుండా సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తిచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాబి దర్శకత్వం వహించనున్న  ఈ చిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ మొత్తం పూర్తయిందని, లొకేషన్ల ఎంపికతో సహా దాదాపు అన్ని పనులు ఓ కొలిక్కివచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తైనా నిజం రూపం దాలిస్తే మెగాభిమానుల ఆనందానికి హద్దే ఉండదని చెప్పవచ్చు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ