Advertisementt

వర్మ ప్రయోగం ఈసారి కూడా బెడిసి కొడుతుందా..??

Fri 10th Apr 2015 04:34 AM
ramgopal varma,sailent,mooky movey  వర్మ ప్రయోగం ఈసారి కూడా బెడిసి కొడుతుందా..??
వర్మ ప్రయోగం ఈసారి కూడా బెడిసి కొడుతుందా..??
Advertisement
Ads by CJ

సంచలనాలకు మారుపేరు రామ్‌గోపాల్‌వర్మ. తన కెరియర్‌లో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలను ఆయన రూపొందించాడు. ఇటీవలి కాలంలో ఈ ప్రయోగాలు ఇంకా వేగం పుంజుకున్నాయి. ఫలితాల విషయాన్ని పక్కనపెడితే వర్మ చేసే ఆలోచనలు వినూత్నంగా ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు. ఇప్పుడు ఆయన మరో కొత్త ప్రయోగానికి కూడా తెరలేపారు. తొలిసారిగా ఆయన ఓ మూకీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రైమ్‌, కామెడీ అంశాలతో రూపొందనున్న ఈ చిత్రానికి 'సైలెంట్‌' అనే పేరును నిర్ణయించారు. సింగీతం శ్రీనివాసరావు 'పుష్పకవిమానం' సినిమా తీసిన తర్వాత వస్తున్న మూకీ సినిమా ఇదే. ఇక ఈ సినిమాలో మాటలు ఉండవు కాబట్టి అన్ని భాషల్లోనూ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తానని వర్మ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ఆయన ప్రయోగాత్మకంగా తీసిన సినిమాలన్నీ వరుసగా పరాజయాల బాట పట్టాయి.

వర్మ ఓ హిట్‌ సినిమా తీయక దాదాపు దశాబ్దం గడిచింది. సర్కారు తర్వాత వర్మ నుంచి చెప్పుకోదగ్గ సినిమానే రాలేదు. 'రక్త చరిత్ర' మొదటిభాగం తెలుగులో పర్వాలేదు అనిపించినా మిగితా భాషల్లో మాత్రం నిరాశ పరిచింది. మరి ఈ తరుణంలో కనీసం 'సైలెంట్‌' అయినా ఆయనకు విజయాన్ని దక్కిస్తుందో లేదో చూడాలి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ