వేశ్యగా ఈ భామ మెప్పించగలదా..!

Fri 10th Apr 2015 04:13 AM
poorijagannath,charmi,jyothilakshmi,sex worker character  వేశ్యగా ఈ భామ మెప్పించగలదా..!
వేశ్యగా ఈ భామ మెప్పించగలదా..!

'టెంపర్' సినిమా హిట్ తో జోరు మీదున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఛార్మి ప్రధాన పాత్రలో 'జ్యోతిలక్ష్మి' అనే చితాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా కథ పై కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నిన్నటివరకు 'జ్యోతిలక్ష్మి' సినిమా అంటే నటి జ్యోతిలక్ష్మి జీవిత కథ అనుకున్నారంతా. కానీ ఈ  సినిమా కథ జ్యోతిలక్ష్మి గారికి సంబంధించినది కాదని పూరి వెల్లడించాడు. మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి 'మిసెస్ పరాంకుశం' అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ నవలలో మిసెస్ పరాంకుశం అనే ఓ సెక్స్ వర్కర్ పెళ్లి చేసుకొని తన జీవితాన్ని ఎలా గడుపుతుందనే అంశం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదే కథను కొన్ని మార్పులతో 'జ్యోతిలక్ష్మి'గా తెరకెక్కిస్తున్నారు. అయితే 'వేదం' , 'పవిత్ర' సినిమాలలో వేశ్య పాత్రల్లో నటించిన అనుష్క, శ్రియ ప్రేక్షకులను మెప్పించారు. మరి అదే పాత్రలో నటిస్తున్న ఛార్మి ఎంత వరకు రీచ్ అవుతుందో చూడాలి..!