Advertisementt

'ఉత్తమవిలన్' ను బ్యాన్ చేస్తారా..!

Tue 07th Apr 2015 07:36 AM
kamalhasan,utthama villain,viswaroopam,viswa hindu parishadh,ban  'ఉత్తమవిలన్' ను బ్యాన్ చేస్తారా..!
'ఉత్తమవిలన్' ను బ్యాన్ చేస్తారా..!
Advertisement
Ads by CJ

విభిన్నమైన చిత్రాలలో నటిస్తూ క్రేజ్ ఇమేజ్ ను సంపాదించుకున్న స్టార్ హీరో కమల్ హాసన్. తను నటించిన 'విశ్వరూపం' సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించినా కొందరి మనోభావాలు దెబ్బతినేలా ఆ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆ చిత్రాన్ని నిలిపివేసే ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన నటించిన 'ఉత్తమ విలన్' సినిమాను కూడా బ్యాన్ చేయాలని విశ్వ హిందూ పరిషద్  నేతలు చెన్నై పోలీస్ కమీషనర్ ని కలిసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఓ పాటలో ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు మధ్య జరిగే సంభాషణలో విష్ణుమూర్తిని దూషించి మాట్లాడినట్లు ఉంది. దీంతో ఈ చిత్రం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉంటుందని భావించి కొందరు పోలీసులను ఆశ్రయించారు. మరి ఈ ప్రభావం 'ఉత్తమ విలన్' పై ఎంత వరకు ఉంటుందో చూడాలి..!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ