Advertisementt

'అవును' కంటే మూడు రెట్లు ఎక్కువట!

Sun 05th Apr 2015 08:47 AM
avunu,avunu 2,avunu 2 collections,ravibabu  'అవును' కంటే మూడు రెట్లు ఎక్కువట!
'అవును' కంటే మూడు రెట్లు ఎక్కువట!
Advertisement
Ads by CJ

అవును, మా సినిమా సూపర్ హిట్ అంటున్నారు దర్శక నిర్మాతలు. విభిన్న చిత్రాల దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహించిన 'అవును 2' చిత్రానికి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు బాగున్నాయట. అవును కలెక్షన్స్ రికార్డులను పార్ట్ 2 బ్రేక్ చేసిందని నిర్మాతలు ప్రకటించారు. మొదటి రోజే పార్ట్ 1 కంటే మూడు రెట్లు ఎక్కువ 'అవును 2' కలెక్ట్ చేసిందట. దాంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నారు. 

అతి తక్కువ నిర్మాణ వ్యయంలో చిత్రాన్ని పూర్తి చేయడం రవిబాబు శైలి. గత చిత్రం హిట్టయ్యిందని బడ్జెట్ పెంచడం ఇష్టం ఉండదు. కమర్షియల్ కొలతలు వేసుకుని సినిమా తీస్తారు. ఒకవేళ ప్లాప్ అయినా నిర్మాతకు వచ్చే నష్టం ఉండదు. ఓపెనింగ్స్ తో ఒడ్డున పడతాడు. అలాంటిది పార్ట్ 1 కంటే మూడు రెట్లు ఎక్కువ వసూలు చేస్తే అంత కన్నా సంతోషం ఏముంటుంది. కానీ, ఈ చిత్రానికి విమర్శకుల నుండి మిశ్రమ స్పందన రావడంతో దర్శకుడు రవిబాబు అసంతృప్తికి గురయ్యాడట. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ