Advertisementt

ప్లాప్ సెంటిమెంట్ పట్టించుకోని సూర్య!

Sun 05th Apr 2015 06:21 AM
suriya,anjaan,24 movie,flop sentiment,samantha  ప్లాప్ సెంటిమెంట్ పట్టించుకోని సూర్య!
ప్లాప్ సెంటిమెంట్ పట్టించుకోని సూర్య!
Advertisement
Ads by CJ

ముంబై నేపధ్యంలో తీసిన 'అంజాన్' సినిమా ప్లాప్ అయినా తమిళ స్టార్ హీరో సూర్య, అలాంటి సెంటిమెంట్స్ ఏవీ పెట్టుకోవడం లేదు. తన తదుపరి చిత్రం '24' షూటింగును ముంబైలో మొదలు  పెడుతున్నాడు. ఈ చిత్ర కథ కూడా ముంబై నేపధ్యంలో సాగుతుందట. 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య నటించబోయే '24' చిత్రం మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 8న ముంబైలో మొదలవుతుంది. నెల రోజుల పాటు కీలక సన్నివేశాలను తెరకేక్కిస్తారు. తర్వాత ఇతర లొకేషన్లకు వెళ్తారు. సమంత ఈ చిత్రంలో కథానాయిక.  2డి ఎంటర్టైన్మెంట్ పతాకంపై హీరో సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్వర మాంత్రికుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.  

సాధారణంగా చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. హిట్ కాంబినేషన్లో సినిమాలు తీయడానికి మొగ్గు చూపుతారు. ప్లాప్ హీరోయిన్, ఇతరాత్రా అంశాలను రిపీట్ చేయడానికి ఇష్టపడరు. కానీ, సూర్యకు అవేమి పట్టించుకోవడం లేదు. కేవలం ప్రతిభపై నమ్మకం ఉంచుతున్నాడు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ