Advertisementt

అభిమానులకు బన్నీ ఇస్తున్న బర్త్ డే ట్రీట్..!

Sun 05th Apr 2015 05:19 AM
allu arjun,twitter account,allu sireesh,birthday treat  అభిమానులకు బన్నీ ఇస్తున్న బర్త్ డే ట్రీట్..!
అభిమానులకు బన్నీ ఇస్తున్న బర్త్ డే ట్రీట్..!
Advertisement
Ads by CJ

ఈరోజుల్లో సోషల్ మీడియాలో ఖాతాలు లేని స్టార్స్ అతి తక్కువ మంది ఉన్నారు. ఎందరో నటీనటులు  ట్విట్టర్, ఫేస్ బుక్ ల ద్వారా తమ అభిమానులతో టచ్ లో ఉంటూ తమ పోస్ట్స్ తో హల్ చల్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటకీ ఫేస్ బుక్ లేదా ట్విట్టర్ లలో ఖాతాలు లేని హీరోలు కొందరు ఉన్నారు. వారిలో అల్లు అర్జున్ ఒకరు. ఈ స్టైలిష్ స్టార్ కు ట్విట్టర్ ఎకౌంటు లేదు. అయితే ఖాతా తెరవడానికి తొందరలోనే ముహూర్తం పెట్టాడట. ఈ ఘనత అంతా అల్లు శిరీష్ కే దక్కుతుంది. అల్లు శిరీష్ తన ట్విట్టర్ లో 'మొత్తానికి బన్నీ ని ట్విట్టర్ లో జాయిన్ అవ్వడానికి ఒప్పించాను. అల్లు అర్జున్ ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు ఎకౌంటు ఓపెన్ చేయనున్నారు' అని ట్వీట్ చేసాడు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా కూడా వెల్లడించారు. ఇప్పటికే ఫేస్ బుక్ లో బన్నీ కి 72 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్ ఓపెన్ చేసే తొలి రోజు రికార్డు స్థాయిలో ఫాలోవర్స్ చేరుతారని అంచనా వేస్తున్నారు. అదే రోజు బన్నీ పుట్టినరోజు కూడా కావడంతో బన్నీ ట్విట్టర్ ఎంట్రీ నిజంగా అభిమానులకు బర్త్ డే ట్రీటే మరి..!  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ